Header Banner

స్టార్ నిర్మాతలతో పవన్ కల్యాణ్ అత్యవసర భేటీ..! ఆ సినిమాలకి షెడ్యూల్ ఫిక్స్!

  Wed Apr 23, 2025 17:01        Cinemas

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గం అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి పనుల్లో పాలుపంచుకుంటూ ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను పూర్తి చేయాల్సిన సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు పవన్ కల్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ స్టార్ ఇమేజ్ ను నమ్ముకుని ఇప్పటికే షూటింగ్ కోసం భారీగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. కానీ ఇలా అర్థాంతరంగా ఆయన సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్స్ కూడా పవన్ రాకకోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. కానీ పవన్ కు మాత్రం రాష్ట్ర విధుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల షూటింగ్స్ కు హాజరు కాలేని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయా నిర్మాతలతో పవన్ కల్యాణ్ అత్యవసర భేటీ నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. ఈ మీటింగ్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల నిర్మాతలు పాల్గొన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ముందుగా 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని మే 10 లోపు పూర్తి చేయాలని మీటింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పాడట. ఈ సినిమాకు కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే చాలని నిర్మాత ఏఎం రత్నం కోరడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రానున్న మే నెలలోనే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత DVV దానయ్యతో అన్నాడని టాక్. ఇక ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ 'ఫైర్ స్ట్రోమ్'ను జూన్ లో విడుదల చేయనున్నట్లు ఇదివరకే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వివరించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీ షూటింగ్ కు జులై నుంచి డేట్స్ ఇచ్చేందుకు పవన్ సంసిద్ధం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మూడు చిత్రాల నిర్మాతలను ఒకే చోట కూర్చోబెట్టి డేట్స్ విషయంలో వాళ్లకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PawanKalyan #PowerStar #PawanMoviesUpdate #HariHaraVeeraMallu #OGMovie